మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో -ఫాంటసీ మూవీ ’విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతోంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్ అవని పాత్ర పోషించిన త్రిషా కృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం చిత్ర బృందం ఒక అద్భుతమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో త్రిషా వెలుగుతున్న దీపాల పళ్ళెం పట్టుకుని ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. దర్శకుడు వశిష్ట విజువల్ వండర్‌గా ’విశ్వంభర’ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, మౌని రాయ్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు విఎఫ్‌ఎక్స్ వర్క్ నిర్వహిస్తున్నాయి. ’విశ్వంభర’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఘనంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.