నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలోని బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రగతినగర్ నుంచి బాచుపల్లి వెళ్లే మార్గంలో మై స్పేస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న సుమారు 6 ఫర్నిచర్ దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దుకాణాల్లోని ఫర్నిచర్ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
The post బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం..పెద్ద ఎత్తున మంటలు appeared first on Navatelangana.













