కల్లేర్: కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కల్లేర్ మండలం బాచుపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కారు నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బాచుపల్లి శివారులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కల్లేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.