హైదరాబాద్: ప్రేమించిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిస్మిల్లా కాలనీలో ఓ యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. గత కొంతకాలంగా తనని పెళ్లి చేసుకోవాలని యువకుడిపై ఒత్తిడి తీసుకొస్తుడడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి విషయంలో ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో యువతిని యువకుడు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి వదిలివెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.