
ఎపిలోని ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలంలో 14 ఏళ్ల బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడినందు కు 42 ఏళ్ల పాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే స్థానిక చర్చిని నడుపుతున్న నింది తుడు చౌటపల్లి రాంబాబు తన ప్రార్థనలకు హాజరైన ఒక కూలీ కుటుంబానికి చెందిన కుమార్తెపై కన్నేసిన ఫాస్టర్ తరచూ అమెపై అత్యాచా రానికి పాల్పడేవాడు. మౌనంగా ఉండేలా ఆమెను బెదిరించేవాడు. ఈ క్రమంలో నెలసరి తప్పిన బాలికకు నిందితుడు అధిక మోతాదులో గర్భనిరో ధక మాత్రలు బలవంతంగా తాగించడంతో పరిస్థితి ప్రాణాపాయంగా మారింది.
ఆ మందుల వల్ల తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగింది. నొప్పిని భరించలేక బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో ఆమెను వెంటనే ఏలూరులోని ఆసుపత్రిలో చేర్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధా రంగా అధికారికంగా కేసు నమోదు చేసినట్లు తడికలపూడి సబ్ -ఇన్‌స్పెక్టర్ వల్లి పద్మ ధృవీకరించారు. బాధితురాలు చికిత్స పొందుతుండగా నింది తుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ‘పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని అరెస్టు చేయడానికి తాము ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాము,‘ అని ఎస్‌ఐ తెలిపారు. బాధితురాలి కుటుంబం, స్థానిక నివాసితులు నిందితుడికి తక్షణమే కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.














