శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణం చోటు చేసుకుంది. శివతేజ్ అనే బాలుడు బ్యాటరీతో ఆడుకుంటూ ఉండగా.. అది అతడి చేతిలో పేలింది. పేలుడు ధాటికి బాలుడి వేళ్లు తెగిపడ్డాయి. వెంటనే కుటుంబసభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కి తీసుకువచ్చారు. శివతేజ్ నాలుగో తరగతి చదువుతున్నాడు.