హైదరాబాద్: రౌడీ షీటర్ దారుణహత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సూరి అనే రౌడీషీటర్ గతంలో తన భార్య, బావమరిది సల్మాన్ ను హత్య చేశాడు. ఈ కేసులతో వరంగల్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ల పరధిలో సూరిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడిపై నగర బహిష్కరణ కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. తన రెండో భార్య తమ్ముడు పుట్టిన రోజు సందర్భంగా సూరి నందనవనం వచ్చాడు. ఆ విషయం సల్మాన్ సోదరుడు అఫ్రోజ్‌కు తెలియడంతో అక్కడి చేరుకొని సూరి కళ్లలో కారం చల్లి పలుమార్లు కడుపులో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రౌడీషీటర్ మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.