
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నెల 23న జరిగిన మొదటి దశ పోలింగ్‌కు సంబంధించి 110 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ బిజెపి అధికారం లోకి వస్తే ముఖ్యంగా మాతువా సామాజిక వర్గానికి ఉమ్మడి పౌరస్మృతిని తక్షణమే అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీదీ అధికారం కోల్పోయి, తృణమూల్ కాంగ్రెస్‌కు బదులు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మాతువా సామాజిక వర్గ సభ్యులకు పౌర హక్కులు కల్పించడానికి మమత ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని,
అందుకే పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్ మూలాలున్న మాతువా సామాజికవర్గం రాజకీయంగా ప్రభావితం చేసే శరణార్ధుల జనాభా అని, అయినా బీజేపీ ప్రభుత్వ పాలనలో అనిశ్చితితో సుదీర్ఘకాలం బతకాల్సిన పని లేదని హామీ ఇచ్చారు. మహిళల భద్రత గురించి టిఎంసి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ఆర్‌జి కార్, సందేశ్‌ఖాలీ,కోల్‌కతా లా కాలేజీలో నేరాలు తదితర సంఘటనలను ప్రస్తావించారు. గత 15 ఏళ్ల టిఎంసి పాలనలో మహిళలు ఎక్కువగా బాధితులయ్యారని విమర్శించారు.












