
మా భూములకు కాదు, మా బతుకులకే కంచె వేస్తున్నారు !
రైతులు దీక్షా శిబిరాన్ని శనివారం అర్ధరాత్రి తొలగింపు
రైతులను వేరే ప్రాంతాలకు తరలింపు
భారీ బందోబస్తు బహదూర్‌గూడ దిగ్భందం
పోలీసుల ఆధీనంలో బహదూర్‌గూడ
బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసుల పహారా
బహదూర్‌గూడ భూ వివాదంలో 36 మందిపై కేసులు నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్ : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణలో భాగంగా ప్రభుత్వం శంషాబాద్ బహదూర్ గూడ రైతులకు చెందిన 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. తొమ్మిది రోజులుగా నిర్వాసితులు తమకు పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వమని, గత 8 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. రైతులు దీక్షా శిబిరాన్ని భారీ పోలీసు బలగాలు తొలగించి, రైతులను అక్కడి నుంచి తరలించారు. భారీ బందోబస్తుతో బహదూర్‌గూడను దిగ్బంధించారు. పోలీసులు రాత్రికి రాత్రి రైతులను వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించారు. ప్రభుత్వఉద్యోగాల సమాచారం పోలీసు పహారాలో ప్రభుత్వం సేకరించిన రైతులకు చెందిన 650 ఎకరాల భూ మి చుట్టూ హైడ్రా, రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్‌గూడ గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని ఇతరుల ను ఎవరిని అక్కడికి రాకుండా పహారా పెట్టారు.
బహదూర్ గూడలో భూములు కోల్పోతున్న రైతులను బిఆర్‌ఎస్ నేతలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డిలు పరామర్శించారు. ప్రభుత్వం తమ భూముల్ని అక్రమంగా లాక్కుంటోందని, మా భూములను కాపాడాలం టూ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ మొరపెట్టుకున్నారు. మా పొలాలకు కాదు, మా బతుకులకే కంచె వేస్తున్నారని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సాగు భూములకు ఫెన్సింగ్ వేస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ తరఫున తాము న్యాయం చేస్తామని.. ధైర్యంగా ఉండాలంటూ సబితా ఇంద్రారెడ్డి భరోసానిచ్చారు.
బహదూర్‌గూడ భూ వివాదంలో 36 మందిపై కేసులు నమోదు
పోలీసులపై దాడికి పాల్పడిన పలువురిపై ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విధుల్లో ఉన్న అధికారు లపై దాడి జరిగిందంటూ శంషాబాద్ రూరల్ ఎస్‌ఐ వనజ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళలు, స్థానిక రైతులు, బిఆర్‌ఎస్, బిజెపి నేతలతో పాటు 36 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి పలు సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళా ఎస్‌ఐ వద్ద ఉన్న ప్రభుత్వ విహెచ్‌ఎఫ్ సెట్ లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. వీరిలో పటోళ్ల కార్తీక్‌రెడ్డి, పంతంగి భూపాల్‌రెడ్డి, మహేందర్, కొలను ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎనిమిది మంది రైతులు జటావత్ రవీందర్, సోమ్లా, జటావత్ కామ్లీ, జటావత్ మణి, పమేనా గాయత్రి, ముదావత్ నీలమ్మ, లిగాని జ్యోతి, దేవేందర్ తదితరులపై బిఎన్‌ఎస్ సెక్ష న్లు 132, 308(2), 121(1) r/w 3(5) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు 650 ఎకరాల ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగు తోంది.
అసలేం జరిగిందం..?
శనివారం ఉదయం బహదూర్‌గూడలోని ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. 650 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా సిబ్బంది సహాయంతో రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఈ సందర్భంగా స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ భూముల లో పంట సాగు చేస్తున్న రైతులు తమకు న్యాయం చేయాలంటూ కంచె వేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఫెన్సింగ్ వేయడాన్ని నిరసిస్తూ రాజేంద్రనగర్ ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరగగా నరసింహ అనే రైతు స్పృహ కోల్పోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులపైకి కారం చల్లి, కుర్చీలు విసిరి...!
ఈ నేపథ్యంలో బహదూర్ గూడలో శనివారం ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొనగా బిఆర్‌ఎస్, బిజెపి నేతలు కూడా రైతులకు మద్దతుగా రంగంలోకి దిగటంతో మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న వారిలో కొంతమంది పోలీసులపైకి కారం చల్లి, కుర్చీలు విసిరేయటం మరింత టెన్షన్ పెంచింది. ఆందోళనకారులు కారం చల్లటంతో డిసిపి యోగేశ్ గౌతమ్‌తో సహా పలువురు సిఐలు కళ్లలో కారంపడి ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైతులకు మద్దతిస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన డిసిపి యోగేష్ గౌతమ్ పోలీసులపై కారం చల్లడం, కుర్చీలు విసరడం సరైంది కాదన్నారు. బహదూర్‌గూడలోని ప్రభుత్వ భూమికి కంచె మాత్రమే వేస్తున్నామని, సాగులో ఉన్న పంటను ధ్వంసం చేయడం లేదన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే రైతులు శాంతియుతంగా నిరసన తెలపాలే కానీ ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు.











