
సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చాక డబ్బులు సంపాదించే మార్గాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు పెడుతూ సంపాదించే వాళ్లు చాలామందే ఉన్నారు. అలా పాపులారిటీతో పాటు పేరు తెచ్చుకుంటున్నారు. అలా పేరు తెచ్చుకొని బిగ్‌బాస్(హిందీ) హౌస్‌లోకి వెళ్లిన వ్యక్తే తన్మయ్ సింగ్. ‘స్కౌట్‌ఆప్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న తన్మయ్ తన ఛానల్‌లో గేమింగ్ వీడియోలు, వ్లాగ్‌లు పోస్ట్ చేస్తుంటాడు. అతడికి 50 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
అయితే హిందీ బిగ్‌బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ 20వ సీజన్‌లోకి తన్మయ్‌ని ఆహ్వానించారు. వేదికపై తన్మయ్‌ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా గేమింగ్ వీడియోల ద్వారా నెలకు ఎంత అర్జిస్తున్నారని తన్మయ్‌ని అడిగారు. తన ఆదాయం ఎంతో అతడు సల్మాన్ చెవిలో చెప్పగా విని షాక్ అయ్యారు. ‘ఏంటి.. నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నావా’ అని ఆశ్చర్యపోయారు. ‘అదంతా వైట్ మనీనే.. చెక్కుల రూపంలోనే నాకు వస్తుంది’ అని తన్మయ్ వివరించాడు.













