హైదరాబాద్: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాళేశ్వరం కూలడానికి బిఆర్‌ఎస్సే కారణమని విమర్శలు గుప్పించారు. ఎన్ డిఎస్ఎ తుది నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని, నిపుణులు చెబితే వెంటనే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని, కరువును దృష్టిలో పెట్టుకుని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పొన్నం సూచించారు. మేడిగడ్డ, కన్నెపల్లిపై బిఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్ డిఎస్ఎ తుది నివేదిక తెప్పించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీశ్‌ రావు బాధ్యతాయుతమైన సూచనలు చేయాలని చురకలంటించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షం బాధ్యతగా సలహాలు, సూచనలు ఇవ్వాలని పొన్నం సూచించారు.