బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణోత్సవ, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అధికారులు ఆలయ సమీపం ప్రాంతాల్లో మంగళ,బుధవారాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాహన దారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం,ఫతేనగర్ ఫ్లై ఓవర్,ఫతేనగర్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను ఎస్సార్ నగర్ టి జంక్షన్ వద్ద నుంచి ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్,అభిలాష టవర్స్,బికె. గుడా ఎక్స్ రోడ్ శ్రీరామ నగర్ ఎక్స్‌రోడ్ నుంచి సనత్‌నగర్,ఫతేనగర్ రోడ్దు వైపు మళ్ళించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపువచ్చే ట్రాపిక్‌ను అనుమతించడం లేదన్నారు. ఈ వాహనాలన్నీ న్యూ బ్రిడ్జి ( హైదరాబాద్ కిచెన్ మార్గ్)వద్ద ఆర్‌యుబి ద్వారా కట్టమైసమ్మ ఆలయం, బేగం పేట వైపు మళ్ళించనున్నట్లు చెప్పారు. గ్రీన్ ల్యాండ్స్ ,బకుల్ ఆపార్ట్‌మెంట్స్,పుడ్ వరల్డ్ నుంచి


 బల్కంపేట వైపునకు వచ్చే వాహనాలకు అనుమతించరని చెప్పారు. వీటిని పుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రి వనం ఎస్సార్‌నగర్ టి జంక్షన్ వైపు మళ్ళించనున్నట్లు చెప్పారు. బేగంపేట,కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపే ఆలయానికి వెళ్ళే ట్రాఫిక్‌ను అనుమతించేది లేదన్నారు. వీటిని బేగం పేట ఫ్లై ఓవర్ మాతా టెంపుల్,సత్యం థియేటర్, మైత్రీ వనం గ్రీన్ ల్యాండ్స్‌వైపు అనుతిస్తారన్నారు. ఎస్సార్‌నగర్ టి జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న సందులు, లింక్ రోడ్లు మూసివేయనున్నట్లు చెప్పారు.భక్తుల పార్కింగ్ కోసం ఆర్ అండ్ బి, జిహెచ్‌ఎంసి గ్రౌండ్స్, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్, డికె రోడ్ నుంచి నేచర్ క్యూటర్ ఆసుపత్రి రోడ్డు వైపు పార్కింగ్, ఫతేనగర్ అండర్ బ్రిడ్జి, నేచర్ క్యూర్ ఆసుపత్రి,జిహెచ్‌ఎంసి ప్లే గ్రౌండ్ ,సనత్‌నగర్ ప్రాంతాల్లో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాల కోసం పార్కింగ్ కేటాయించినట్లు చెప్పారు. ప్రయాణంలో ఏదైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెం ః 9010203626ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.