
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ “దర్శకుడు కమల్.. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే చెప్పాడు.
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పా డు. అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం సిద్ధమయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. కం టెంట్ కూడా కొత్తగా ఉంటుంది. జూన్ 19న బలమైన కంటెంట్‌తో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తు లు’ ఆడియెన్స్ ముం దుకు వస్తోంది”అని అన్నారు. దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ “నా డెబ్యూ మూవీ ఇంత గొప్ప గా ఉంటుందని అనుకోలేదు. వడ్డే నవీ న్ ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్టుగా ఆయన రీ ఎంట్రీ, కమ్ బ్యాక్ ఉం టుంది. టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాశీ సింగ్, వడ్లమాని శ్రీనివా స్, సాయి కిరణ్, సాత్విక్, రామ్ సుం కర, కళ్యాణ్ నాయక్, విజయ్ ముక్తవరపు, కార్తీక్ సుజాత సాయికుమార్, భిక్షపతి, ప్రియాంక పాల్గొన్నారు.













