
చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన టివికె అధినేత విజయ్ శాసనసభలోనూ తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. బలపరీక్షకు సంబంధించి ఈ ఉధయం విజయ్.. సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చ జరిగిన తర్వాత స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇది కాస్త ఆసక్తికరంగా సాగింది. సాధారణ ఓటింగ్ మాదిరిగా కాకుండా.. ఒక్కో సభ్యుడి పేరును పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని అడిగి నమోదు చేసుకున్నారు.
ఇందులో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బలపరీక్ష సమయంలో డిఎంకె సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. టివికె ప్రభుత్వానికి కాంగ్రెస్, విసికె, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. అన్నాడిఎంకె రెబల్ ఎమ్మెల్యేలు కూడా సిఎంకు అనుకూలంగా ఓటేశారు.












