
హైదరాబాద్: పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బండి భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న భగీరథ్.. బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ క్రమంలో సోమవారం కోర్టులో భగీరథ్ పిటీషన్ పై కీలక వాదనలు జరిగాయి. ఈ కేసులో బెయిల్ ఇస్తే.. బండీ భగీరథ్, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని బాధితుల తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.












