
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నం. 10లో ఓ భవనం సెల్లార్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్నఅగ్నిమాపక, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భవనంలోని 11 మందిని కాపాడారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. భవనం సెల్లార్ లో వైన్ షాప్ గోదాము నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.








