
బర్మింగ్‌హామ్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పాకిస్థాన్ 17 ఓవర్లలో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మునిబా అలీ ఒక్కటే కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. మునిబా 5 ఫోర్లతో 41 పరుగులు చేసింది.
మిగతా వారిలో గుల్ (12), అయేషా (12), ఆలియా రియాజ్(18) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 10 పరుగులకే ఐదు వికెట్లు తీసింది. శ్రీచరణికి మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను ఓపెనర్ స్మృతి మంధాన (68), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38) ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన రిచా ఘోష్ 17 బంతుల్లోనే 34 పరుగులు సాధించింది.











