లేబర్ పార్టీకి కొత్తగా ఎన్నికైన ఆండీ బర్న్ హ్యామ్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా సోమవారంనాడు ప్రమాణ స్వీ కారం చేశారు. బ్రిటన్ రాజకీయాల్లో దేశాన్ని ఒక కొత్త దిశ వైపు నడిపిస్తానని వాగ్దానం చేశారు. సమస్యల పరిష్కారం దిశగా తన రాజకీయాలు ఉంటాయని అన్నారు. ఏభై ఆరేళ్ల బర్న్ హామ్ తన ముందున్న ప్రధానులు సంప్రదాయంగా అనుసరించిన పోడియం నుంచి కాకుండా తన కొత్త హెడ్ క్వార్టర్స్ నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత నలభై ఏళ్లలో చేపట్టని అతిపెద్ద సంస్కరణలు ముందుకు తీసుకురానున్నామని,

ఒక కొత్త రాజకీయ నమూనా, ఆర్థిక నమూనాతో ముందుకు వెళ్తామని చెప్పారు. కీర్ స్మార్టర్ ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. దీంతో లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేసంలో లేబర్ పార్టీ పక్షనేతగా ఆండీ బర్న్‌హోమ్ను ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ షబానా మహ్మద్ అధికారికంగా ప్రకటించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బర్న్‌హ్యామ్‌ను కింగ్ ఛార్లెస్-- -౩ సోమవారంనాడు ఆహ్వానించారు.