భూమి తిరగడమేమోగానీకాలం పరిగెడుతున్నట్లైతే,కళ్ళారా కనిపిస్తూనే ఉందిఎవరో తరుముతున్నట్లుగాపడిపోయిందేదీ పట్టుకోనంతగాకాలం పరిగెడుతూనేఉందినిన్నటి జ్ఞాపకాలే గుర్తులేనంతగాపొద్దుటి ముఖాన్నే పోల్చలేనంతగాతీయని జ్ఞాపకాలకు తీరిక లేనంతగాపడుతూ లేస్తూ, పడుతూ లేస్తూకాలం పరిగెడుతూనే ఉందిబతుకు ఇరుసుపైదురాశ కందెన పూసికాల కొరడా ఝుళిపిస్తున్న మనిషితిరిగీ తిరిగి, మొదలెట్టిన చోటుకే వచ్చిపరిగెడుతూ కరిగినది కాలం కాదని,తన ప్రయాణం అని తెలిసే సరికేమనిషి లేకపోవడం యాదచ్ఛికమే!
The post బతుకు ఇరుసుపై దురాశ కందెన! appeared first on Navatelangana.










