హైదరాబాద్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్ ఓటమిని చవిచూడడంతో సిరీస్ కోల్పోయింది. భారత జట్టులోకి వైభవ్ వంశీని తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో వైభవ్ వాటర్ బాటిల్స్ అందిస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్ మీడియాతో మాట్లాడారు. వైభవ్ సూర్యవంశీని జట్టుతోనే ఉండనివ్వాలని, ఆటగాళ్లకు సాయం చేయనివ్వాలని, అనుభవంతో ఎన్నో విషయాలు నేర్చుకుంటాడని వివరించారు. వైభవ్‌తో వాటర్ బాటిల్స్ మోయించడంపై వ్యాఖ్యలు వచ్చాయి. 1990, 2000 సంవత్సరాల్లో తాను కూడా బాల్ బాయ్‌గా పని చేశానని గుర్తుఉ చేశారు. మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, మాజీ చాలా మంది ఆటగాళ్లు వాటల్ బాటిల్స్ మోశారన్నారు. మంచీ నీళ్లు ఇవ్వడం అనేది తక్కువ చేయడం కాదని మండిపడ్డారు. ఒక్కసారి వైభవ్ టీమిండియాలోకి వస్తే కొనసాగుతూనే ఉంటాడని, తీసుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఐపిఎల్ అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందులో ఎలాంటి సందేహం లేదని, మంచి ప్రతిభ కలిగిన ఆటగాడని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. గతంలో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ తీరు చూశామని, ఇప్పుడు వైభవ్ ఆటతీరు కూడా అలానే ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. 11 మందిలో చోటు దక్కనంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని, సుదీర్ఘమైన కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుందని రవిచంద్రన్ అశ్విన్ వివరించారు.