భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపియన్ సైనా నెహ్వాల్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించారు. 2020 బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సమక్షంలో ఆ పార్టీ కండువ కప్పుకున్నారు. దీంతో త్వరలో ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు సైనా తెలిపారు.

‘‘రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాట నిజమే. కానీ ఎప్పుడు రావాలనే దానిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా దేశానికి ఎన్నో ఏళ్లు ప్రాతినిధ్యం వహించాను. ఒలింపిక్స్‌లో పతకం కూడా అందించాను. ఇక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. నాకు బిజెపి అంటే చాలా ఇష్టం. ఆ పార్టీ దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న కృషి నాకు బాగా నచ్చింది. అందుకే బిజెపిలో చేరాను. ఇప్పుడు బిజెపి తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి రాజకీయ నేతగా అదృష్టాన్ని పరీక్షించుకోవలని అనుకుంటున్నా. బిజెపిలో కొనసాగుతూ దేశానికి సేవ చేయడం కోసం ఎదురు చూస్తున్నా. మనందరం ఐక్యంగా ఉంటేనే దేశాభివృద్ధి కోసం మరింత మెరుగ్గా పని చేయగలం’’ అని సైనా చెప్పుకొచ్చింది.