రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగింది. పురపాలక శాఖ సెక్రటరీ 91 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ జీవో ఆర్‌టి నెం. 574 ఉత్తర్వులును శనివారం జారీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే పోస్టింగ్ స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు. దీనికి సబంధించిన ఉన్నతాధికారులు వెంటనే రిలీవింగ్ ఆర్డర్‌లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు.