
ఢిల్లీ: ప్రపంచ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందని పిఎం మోడీ ప్రశంసించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఉన్నామని ఇండియా ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని పిఎం వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ అంచనా వేసిన 7 శాతం కంటే వృద్ధిరేటు ఎక్కువగా ఉందని మెచ్చుకున్నారు. ఈ వృద్ధి రేటును దేశ ప్రజలు పండుగలా జరుపుకోవాలన్నారు. భారతీయుల సంకల్ప బల, కృషికి నిదర్శనమని కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు వెళ్తున్నామని, 140 కోట్ల ప్రజల ఐక్యత దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని మోడీ తెలియజేశారు. అమెరికా-ఇరాన్ యుద్ధంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నా కూడా భారత్ పురోగమిస్తుందని, స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు విదేశీ ప్రయాణాలు వద్దని సలహాలు ఇచ్చారు. అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.








