హరారే: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టి-20లో జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ జింబాబ్వేని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన జింబాబ్వే తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో బ్రెయిన్ బెన్నెట్(0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్ వేసిన 4వ ఓవర్ రెండో బంతికి బెన్ కర్రన్ (10) వైభవ్ సూర్యవంశీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోసారి మయాంక్ బౌలింగ్‌లో డియాన్ మేయర్స్(6) శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజ్‌లో సికందర్ రజా(0), రియాన్ బర్ల్(1) ఉన్నారు.