బెంగళూరు: భార్య, ఇద్దరు పిల్లలను చంపి అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... హుణసూరు పట్టణం న్యూ మారుతి లే అవుట్లో హరీష్(19), నిశ్చిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరష్ తన తల్లిని అమ్మమ్మ ఇంటికి పంపించాడు. అనంతరం ఇద్దరు పిల్లలు, భార్య నోటికి ప్లాస్టర్ అంటించి అనంతరం గొంతు నులిమి చంపేశాడు. తరువాత భర్త ఉరేసుకొని చనిపోయాడు. ఇంట్లో ఉలుకుపలుకు లేకపోవడంతో ఇంటి పక్కన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.