పెళ్ళికి ముందే మరోకరితో ఉన్న ప్రేమ వ్యవహారం నేపధ్యంలో ఒ భార్య కట్టుకున్న భర్త ఆత్మహత్యకు పాల్పడే విధంగా వ్యవహరించి చివరికి ఆ నవవరుడి ప్రాణాలనే తీసింది. వివాహంజరిగిన మూడు నెలలకే భార్య వేధింపులు తాళ లేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రఘునాథపాలెం మండలంలోని రాంక్య తండాలో వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంక్య తండాకు చెందిన సదర్ లాల్ కు ఈ ఏడాది మే నెలలో ఇదే మండలంలోని ఒక యువతితో వివాహమైంది. నూరేళ్ల పంటగా సాగాల్సిన వారి వైవాహిక జీవితంలో పెళ్లయిన మూడో రోజు నుంచే విషాదం అలుముకుంది. నీకు మగతనం లేదు అంటూ భార్య కట్టుకున్న భర్తను తీవ్రంగా అవమానించడం, ప్రారంభించింది.మగ తనం లేదని ప్రతి రోజు నిందిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదర్ లాల్, తనపై వచ్చిన నిందను తుడిచేసుకోవడానికి, తన సమర్థతను నిరూపించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్టులు కూడా చేయించుకున్నాడు.

వైద్య పరీక్షల్లో సదర్ లాల్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు స్పష్టం చేసినప్పటికీ, భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కట్టుకున్న భార్య ప్రతి రోజు నిత్యం సెల్ ఫోనో లో ఛాటింగ్ చేయడం,ఫోన్ మాట్లాడటం,విడియో కాల్స్ మాట్లాడంపై కూడా భార్య భర్తల మధ్య విభేధాలు చోటు చేసుకున్నాయి. పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తున్నట్లు భర్త భార్య సెల్ ఫోన్ లో గుర్తించారు. ఈనేపద్యంలో సీత్ల పండక్కి అత్తవారింటికి వెళ్లిన సదర్ లాల్ కు భార్యతోపాటు అత్త,బావమరిధిలో తీవ్రంగా అవమానించారు.దీనిని తట్టుకోలేక సదర్ లాల్ తన తల్లికి,అక్కకి,బావకి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి సాగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సదర్ లాల్ భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని, ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా చేసుకుని, ఎలాగైనా భర్తను వదిలించుకో పక్కా వ్యూహంతోనే ఈ వేధింపులకు పాల్పడిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో నిజం తేలినా కావాలనే అతడిని మానసిక క్షోభకు గురిచేసి,

ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని ఆరోపిస్తున్నారు. తన కుమారుడికి మగతనం లేదని చెబుతున్న భార్య ఇప్పుడు ఎలా గర్బవతి అయిందని, గర్బవిచ్చిత్తికి మందులు ఎందుకు వాడిందని మ్రతుడి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద భార్య వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెందిన సదర్ లాల్ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఈ ఘటనపై రఘునాధపాలేంపోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నారు.