బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్ర కారం దర్యాప్తు చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్టు చేశారని సిఎం రే వంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనిఖీల్లో బం డి భగీరథ్ దొరికారని పోలీసులు చెప్పారని తాను పోలీసుల మాటలనే నమ్ముతానని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బం డి భగీరథ్‌ను అప్పా జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బండి సం జయ్ స్వయంగా ఆయన కుమారుడిని అప్పగించారని వచ్చిన వార్తలపై సిఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ బండి సంజయ్

ఇంట్లో ఆయన కుమారుడిని పోలీసుల కు అప్పగిస్తే అప్పగింత అవుతుందని, నడిరోడ్డుపై పోలీసులు భగీరథ్‌ను అరెస్టు చేస్తే ఎలా అప్పగించినట్టు అవుతుందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఐదురోజులు పోలీసులు సోదా చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారని, ఒకవేళ బండి భగీరథ్‌ను సరెండర్ చేస్తే పోలీసులను పిలిచి అప్పచెబుతారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చేశారని అనుకోవచ్చని బండి భగీరథ్ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని సిఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు.