ముంబయి: నాలుగంతస్తుల భవనం కూలిపోవడంతో 9 మంది చనిపోయిన సంఘటన మహారాష్ట్రలోని భివండీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం.... బాలాజీ నగర్ లోని  కోహినూర్ నాలుగంతస్తుల భవనంలో 48 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో 9 మంది చనిపోయారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. పది సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భవనాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు మున్సిపల్ అధికారులు అదేశాలు జారీ చేసినప్పటికి నివాసితులు పట్టించుకోలేదన్నారు. ఖాళీ చేయకుండానే అనధికారికంగా మరమ్మతులు చేపట్టారని వివరించారు. మృతులు ఎక్కువగా మరమ్మతులు చేపట్టేవారని పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.