
అమరావతి: భోగాపురం విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ను జాతికి అంకితం చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని వెంట ఉండి పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఎయిర్ పోర్ట్ పనులను చంద్రబాబు, పవన్ తో కలిసి మోడీ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. రికార్డు స్థాయిలో 13 వేల మందితో థింసా నృత్యం జరిగింది. థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని మోడీ తిలకించారు. బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోడీ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు మోడీకి బొబ్బిలి వీణను బహుకరించారు.










