
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా భవానీనగర్ లో దారుణం జరిగింది. భర్తను భార్య, కుమారుడు కర్రతో కొట్టి చంపారు. భర్త చంద్రయ్య (50), భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారి, కుమార్తె కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా చంద్రయ్య మద్యానికి బానిసయ్యాడు. ఒక రోజు అర్థరాత్రి మద్యం మత్తులో తల్లిని కొడుతుండగా కుమారుడు అడ్డుకున్నాడు. భార్య, కుమారుడు తిరిగి కర్రతో కొట్టడంతో చంద్రయ్య మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











