
అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శ్రీరామ్‌పూర్ గ్రామంలో దారపు రెడ్డి అప్పలనాయుడు(34), హైమ(29) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కలాసీ పని చేస్తూ ఇంటి నుంచి వైజాగ్‌కు ప్రయాణం చేసేవాడు. జోగన్నపాలెం గ్రామానికి చెందిన బండారు గంగాధర్(29)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అప్పలనాయుడుకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో దంపతులు గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భర్త అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి చంపాలని నిర్ణయం తీసుకుంది. గంగదార్ తన మేనల్లుడు నాగచరణ్(19)తో హత్యకు ప్లాన్ చేశాడు. లక్ష రూపాయలు ఇస్తే కిరాయి హంతకులు షఫీర్, ప్రకాశ్‌లతో చంపిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. జులై 1న అర్థరాత్రి గంగాధర్ మరో ఇద్దరుతో కలిసి అప్పలనాయుడు ఇంటికి వచ్చారు. భార్య బయటకు ఉండగా ముగ్గురు ఇంట్లోకి చేరుకొని గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం లక్ష రూపాయలు ఇవ్వడంతో వారు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. వెంటనే హైమ, గంగాధర్, నాగచరణ్ ఎంఆర్‌ఒ ఎదుట లొంగిపోయారు. షఫీర్, ప్రకాశ్‌ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.









