అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కెపిహెచ్ బి  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన శీతల్ పురుషోత్తం (32) ,సోనీ దంపతులు ఉద్యోగరీత్యా గత కొంత కాలం క్రితం నగరానికి వచ్చి  కెపిహెచ్ బి పరిధిలోని పంచవటి అపార్ట్ మెంట్ లోని 504 ప్లాట్ లో నివాసం ఉంటున్నారు. గృహిణిగా ఉన్న శీతల పురుషోత్తం గత కొంతకాలం నుంచి డిప్రెషన్ కు గురవుతుంది. సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గృహిణి మృతికి గల కారణాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.