దక్షిణ చైనాలో సంభవించిన అత్యంత తీవ్రమైన ప్రమాదం ఇది. గ్వాంగ్జూ ప్రాంతంలోని నాన్నింగ్ నగర పరిధిలో గల హెంగ్‌జౌలో ఈ ప్రమాదం జరిగింది. మేసాక్ అనే శక్తివంతమైన టైఫూన్ వల్ల ఈ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు రికార్డు స్థాయిలో అసాధారణమైన భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల వరద ఉధృతి పెరిగి లియులాన్ అనే మీడియం సైజ్ డ్యామ్ గోడలు సోమవారం ఉదయం ఒక్కసారిగా బద్దలయ్యాయి .డ్యామ్ రెండు చోట్ల పూర్తిగా తెగిపోవడంతో దిగువ ప్రాంతాలకు భారీగా వరద నీరు దూసుకొచ్చింది. అధికారులు వెంటనే స్పందించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లోని వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనతో కమ్యూనికేషన్ మరియు విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.