
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని స్వల్పస్కోర్‌కే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ట్రావిస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో ఎస్ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెకెఆర్ వరుణ్ 3, నరైన్, కార్తీక్ చెరి 2, వైభవ్, గ్రీన్, అనుకుల్‌లు తలో వికెట్ తీశారు.













