
ఐపిఎల్ సీజన్ 2026 ప్లేఆఫ్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) నిష్క్రమించింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన గిల్ 37 బంతుల్లోనే 64, సుదర్శన్ 53 బంతుల్లోనే 84 పరుగులు చేశారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్, రబడా మూడేసి వికెట్లను పడగొట్టారు. సిఎస్‌కె టీమ్‌లో శివమ్ దూబె 17 బంతుల్లోనే 47 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.











