భువనేశ్వర్: ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మహిషానపుటాలో వద్ద గురువారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని దేంకానిల్ ఆసుపత్రికి తరలించారు. మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్ రాహులుగా గుర్తించారు. బుధవారం రాత్రి వీరు ఓ వివాహానికి హాజరై, స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ్రమాంం చోటుచేసుకుంది.