అతి చిన్న వయస్సులోనే ఐపిఎల్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ 15 ఏళ్లకే ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్‌లో భారీగా పరుగులు చేస్తున్న వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కాగా, ఎంత సీరియస్ క్రికెట్ ఆడుతున్న.. వైభవ్‌లోని ఆ చిన్న పిల్లాడి లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఇప్పటికీ తాను కార్టూన్లు చూస్తానని చెప్పాడు. ఇప్పుడు తన ఫోటో కోసం వచ్చిన పిల్లలను సరదాగా ఆటపట్టించాడు.

మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్ సూర్యవంశీని చూసేందుకు చిన్నారులు వచ్చారు. వాళ్లతో వైభవ్ ‘‘బ్రదర్.. నేను ఫోటో ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును నేను సీరియస్‌గా చెబుతున్నా’’ అని అన్నాడు. దీంతో ఆ చిన్నారులు ఆలోచనలో పడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వైభవ్ వాళ్లను అడ్డుకొని ఒక్కో ఫోటోకి రూ.100 తీసుకుంటానని.. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అని అడిగా. అందులో ఓ పిల్లాడు ‘నా దగ్గర రూ.200 ఉంది’ అని ఆఫర్ చేశాడు. వెంటనే వైభవ్ నవ్వేసి ఇదంతా ఫ్రాంక్ అని చెప్పి వారితో ఫోటోలు దిగి పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్‌మీడియాలో షేర్ చేసింది.