కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యత తక్కువగా ఉండటంతో, యాజమాన్యాలు వాహనాల

రకాన్ని బట్టి రేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలకు కేవలం రూ. 200 విలువైన పెట్రోల్‌ను మాత్రమే పోస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు గరిష్టంగా రూ. 1,000 వరకు మాత్రమే ఇంధనాన్ని నింపుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద డబ్బాలు లేదా క్యాన్లలో పెట్రోల్ నింపడాన్ని పూర్తిగా నిషేధించారు. అత్యవసర పరిస్థితుల పేరుతో వచ్చే వారికి కూడా ఇంధనం నింపే ప్రసక్తే లేదని బంకు యజమానులు పేర్కొన్నారు.