
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై.. లక్నోని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన లక్నో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 33 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సులతో 85 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. చివర్లో షహబాజ్ అహ్మద్ మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 203 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్‌లో ఓవర్టన్ 3, అన్షుల్ 2. నూర్ 1 వికెట్ తీశారు.














