
హైదరాబాద్: ఢిల్లీలో మంగళవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్‌భవన్ కార్యకర్మం చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి లోక్‌భవన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పిసిసి అధ్యక్షుడు, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మరి వెంకట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్‌భవన్కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.











