ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చరిత్ర సృష్టించింది. తొలిసారి జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ షట్లర్‌గా రికార్డు నమోదు చేసింది. సెమీస్‌లో చైనాకు చెందిన చెన్ యుఫీయ్‌పై 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది. రెండో సెట్‌లో సింధు ఆధిక్యంలో ఉండగానే యుఫీయ్‌ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో సింధు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. రెండేళ్ల తర్వాత ఓ ఫైనల్‌కి చేరడం సింధుకు ఇదే తొలిసారి. చివరిసారి 2024లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ విజేతగా సింధు నిలిచింది.

ఇక జపాన్ ఓపెన్ ఫైనల్‌లో అకనె యమగుచితో సింధు తలపడనుంది. సెమీస్‌లో 9-21, 21-16, 21-14 తేడాతో పుత్రి కుసుమ వర్దానిపై జపాన్‌కు చెందిన యవగురి విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. ఇందులోనూ గెలిస్తే జపాన్ ఓపెన్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళా షట్లర్‌గా సింధు అవతరించనుంది.