హైదరాబాద్: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి రాథోడ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న రాథోడ్‌ను కుటుంబ సభ్యులు కాపాడారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాసింగ బలాలు వంటి వరస హిట్ పాటతో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే.