విశాఖపట్నం: విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. టీచర్ కొట్టి దెబ్బలు తాళలేక ఆరేళ్ల విద్యార్థి మృతి చెందాడు. నగరంలోని వన్‌టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం స్కూల్‌కి వచ్చిన విద్యార్థి ప్రణయ్ తేజ(6)ను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించారు. ఈ క్రమంలో ఆమె చేయి చేసుకున్నారు. టీచర్ కొట్టిన దెబ్బలు తాళలేక క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. టీచర్ కొట్టిన దెబ్బల వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ విచారణ చేపట్టింది.