భారత డ్రగ్ కంట్రోల్ జనరల్ (డిసిజిఐ) డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాకు అనుమతి ఇచ్చింది. టకేడా బయోఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన ఈ వ్యాక్సీన్‌ను 4 నుండి 60 ఏళ్ల వయస్సు వారు తీసుకోవచ్చు. ఇది డెంగ్యూలోని 4 రకాల వైరస్‌ల నుండి రక్షణనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసుల్లో 3వ వంతు భారత్‌లోనే నమోదవుతుండగా, 2025 లో 1,13,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 43 దేశాల్లో 3.2 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు, 7 ఏళ్ల డేటా ప్రకారం ఇది ఆసుపత్రి పాలయ్యే ప్రమాదాన్ని సమర్థవంతంగా అడ్డుకుటుందని డాక్టర్ మహేందర్ నాయక్ తెలిపారు. 28,000 మందిపై జరిపిన ప్రయోగాల్లో 2 డోసుల తర్వాత ఇది 80.2% పనితీరు చూపించింది.