
ఆకట్టుకునే పోస్టర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరి’ మేకర్స్ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషియో -నేషనల్ డ్రామా టీజర్ త్వరలో విడుదల కానుందని ప్రకటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చెట్టన్ డీకే దర్శకత్వంలో, సాగర్ బి షిండే రచించి నిర్మిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పొయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ రసాయనాల దుర్వినియోగం, ముఖ్యంగా పురుగుమందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్ ఈ చిత్రంలోని తీవ్రమైన, ఆలోచింపజేసే అంశంపై ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది. త్వరలో రానున్న టీజర్ ప్రేక్షకులను ‘ది ఇండియా స్టోరీ’ ప్రపంచంలోకి మరింతగా తీసుకెళ్తుందని మేకర్స్ తెలిపారు. తొలిసారి కలిసి నటిస్తున్న కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే తమ ఎమోషనల్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో కథకు మరింత బలం తీసుకురానున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.











