
అగర్తాలా: త్రిపుర డిజిపి అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిజిపి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్ట్స్‌లో తన రూమ్ లో గన్ కాల్చుకున్నట్టు సమాచారం. రక్తపు మడుగులో ఉన్న అతడిని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. డిజిపి మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. డిజిపి మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారని, అప్పటికే చనిపోయాడని, దాదాపు 40 నిమిషాల పాటు సిపిఆర్ చేశామని, చివరికి 12:48 గంటలకు మృతి చెందారని వైద్యులు వివరించారు. అనురాగ్ మే 2025లో త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన త్రిపురలో ఇంటెలిజెన్స్ విభాగంలో డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో విశిష్టమైన సేవలందించిన ఆయన, తన పదవీకాలంలో అనేక కీలకమైన కేసుల దర్యాప్తును చేపట్టారు. వృత్తిపరమైన పనితీరు మరియు విస్తృతమైన పోలీసింగ్ అనుభవానికి పేరుగాంచిన ధంకర్, రాష్ట్రంలోని అత్యంత సీనియర్ IPS అధికారులలో ఒకరిగా గుర్తింపు పొందారు











