
దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ పోరులో సౌత్ జోన్ ఆధిక్యంలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 40/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు సోమవారం ఆటను కొనసాగించిన సౌత్ జోన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 285/9 స్కరో చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 90 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ తిలక్ వర్మ (106 నాటౌట్) శతకం సాధించాడు. ఏడో స్థానంలో వచ్చిన శ్రేయస్ గోపాల్ (88) సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.











