నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ పదోన్నతులు కల్పించింది. 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హోదా పొందిన వారిలో ఐపీఎస్‌ అధికారులు మహేశ్‌ భగవత్‌, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్‌కుమార్‌, వీసీ సజ్జనార్‌ ఉన్నారు.

The post ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్‌ల‌కు డీజీ హోదా appeared first on Navatelangana.