
బసవేశ్వరుడి స్ఫూర్తితో తా ము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యా యం కోసం పని చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తమ పార్టీ మహిళలకు 33 శాతం టికెట్లు, పార్టీ పదవులు ఇస్తుందని ప్రకటించారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొం దారని వ్యాఖ్యానించారు. బసవేశ్వరుడి 839వ జయంతి సం దర్భంగా సోమవారం తెలంగాణ జాగృతి నాయకులతో క లిసి ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందని అన్నారు.
ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నామని చెప్పారు. కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం మనం ఈ రోజుకు పాటు పడుతున్నామంటే మ నం వెనుకబడి ఉన్నట్టు లెక్క అని పేర్కొన్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని మండిపడ్డారు. బిల్లు పాస్ అయితే బాగుండేదని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చిందని, మొత్తంగా అసెంబ్లీలో ఎనిమిది మంది మహిళా ఎంఎల్‌ఎలు ఉన్నారని అన్నారు.

