
లండన్: భారత్‌ను డోపింగ్ సమస్య వెంటాడుతోంది. డోపింగ్ సమస్య ప్రమాదకరంగా మారిన దేశాల జాబితాలో భారత్ చేరింది. డోపింగ్‌లో ఇప్పటి వరకు కేటగిరీబిలో ఉన్న భారత్ తాజా పరిస్థితుల్లో కేటగిరిఎకు మారింది. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఎఐయు) సోమవారం వెల్లడించింది. కేటగిరిఎలో చేరడంతో ఇక నుంచి భారత అథ్లెట్లు మరింత కఠినమైన డోపింగ్ నిరోధక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కేటగిరిఎలో కెన్యా, నైజీరియా, రష్యా, ఇథియోపియా, బెలారస్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ చేరడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. అథ్లెటిక్స్‌లో అత్యధిక డోపింగ్ ఉల్లంఘనల విషయంలో భారత్ గత మూడేళ్ల కాలంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిందని ఎఐయు వెల్లడించింది.

